Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగన్న
నవతెలంగాణ- మొయినాబాద్
రైతుల భూమిని రైతులకు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగన్న అన్నారు. మొయినాబాద్ మండల్ హిమాయత్‌నగర్‌లో సర్వేనెంబర్ 151 బై ఆరు గల 12 ఎకరాల ప్రభుత్వ భూమి 50 ఏండ్లుగా 6 దళిత కుటుంబాలు సాగు చేసుకుంటున్నాయి. 2009 వరకు అన్ని రికార్డులు ఆ రైతులకు ఉన్నాయి. 2009 తర్వాత ప్రభుత్వం ఆ భూమిని పట్టాదాలకు తెలియకుండా ప్రభు త్వం ఖరీదు ఖాతాకింద రాసుకుంది. ఈ రైతులకు ప్రభు త్వం చెప్పినట్టు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వడమే కాకుండా ఆ భూమిని ప్రభుత్వం వెనకకు సమంజసం కా దని ఒకవేళ ప్రభుత్వం ఆ భూమిని అభివృద్ధికి తీసుకోవ డం మేము వ్యతిరేకం కాదు కానీ 2000 ప్రభుత్వం భూసేకరణ చట్టం కింద తీసుకొచ్చిన చట్ట ప్రకారం రైతుల కు మార్కెట్ రేటు కన్నా మూడంతలు నష్టపరిహారం ఇవ్వా లని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగన్న ప్రభు త్వాన్ని కోరారు. మండల కేంద్రంలో హిమాయత్ నగర్ దగ్గరగల వ్యవసాయ భూమిని ఆయన పరిశీలించారు. ఆ భూమిలో మాలరాజు జొన్న పంటను, కంది వేసినాడు. అధికారులు పంటను నష్టం చేయడం సమంజసం కాదని అట్టి దళిత రైతు మీద ఆర్డిఓ ద్వారా కేసు పెట్టడం ప్రభు త్వానికి చెల్లదని ప్రభుత్వం పునరాలోచన చేసి ఆ భూమిని దళితులకే ఇవ్వాలని సీపీఐ జిల్లా కమిటీ నాయకులు ఏం ప్రవలింగం, కే రామస్వామి, మండల కార్యదర్శి మొయినా బాద్ కే శీను, చేవెళ్ల కార్యదర్శి సత్తిరెడ్డి, నరేందర్ కాసు మాలరాజు, గూడెం హైలెస్, సుక్కమ్మ గూడెం లక్ష్మయ్య, కంజర్ల జగదీష్, కంజర్ల శ్యాంసుందర్, తదితరులు పాల్గొన్నారు.