Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ- ధరూర్
వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 'మీతో నేను' కార్యక్రమంలో భాగంగా మంగళవారం మం డల పరిధిలోని డీకే తండా స్టేషన్ ధారూర్ గ్రామా ల్లో పర్యటించారు. గ్రామాల్లో పరిశుభ్రత పాటిం చడం లేదని, శానిటేషన్ సక్రమంగా నిర్వహిం చలేనందున ఎమ్మెల్యే అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పాడుబడ్డ ఇడ్లు పిచ్చి మొక్కలు తొలగించి, గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రతి రోజూ చెత్త సేకరిస్తూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. 2,3, 4,8 వార్డులలో నీటి సమస్య ఎక్కువగా ఉందని మిషన్ భగీరథ నీటి పైపు లైన్లు ఎక్కడా లీకేజీలు లేకుండా, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి,గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించాలన్నారు. అనం తరం స్టేషన్ ధారూర్ గ్రామానికి చెందిన ముత్యాల్ బారు కి మంజూరైన రూ. 35 సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజే శారు. కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షులు వేణుగో పాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అంజయ్య, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రుద్రారం వెంకటయ్య, మం డల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అంజయ్య, రాజగుప్త, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాములు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు వీరేశం, గ్రామ సర్పంచ్ రేణు క శ్రీనివాస్ నాయక్, ధారూర్ సర్పంచ్ చంద్రమౌళి, మం డల రైతు సంఘం అధ్యక్షులు లక్ష్మయ్య, అధికారులు, తహ సిల్దార్ భువనేశ్వర్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఎంపీఓ షఫీ ఉల్లా, డిప్యూటీ ఈఈ రత్న ప్రసాద్, ఏఓ జ్యోతి, ఏపీవో సురేష్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రామ్ రెడ్డి, రహిమతుల్లా ఖాన్, నగేష్ గౌడ్, సుధాకర్ గౌడ్, బిచ్చయ్య, మండల టౌన్ ప్రెసిడెంట్ యాత్రగౌడ్, యూత్ అధ్యక్షులు మహేష్ కుమార్, మండల ఎస్సీ సెల్ సోషల్ మీడియా విజరు, మండలం బిసిసెల్ ప్రచార కార్యదర్శి ఎల్లప్ప, గ్రామపార్టీ అధ్యక్షులు వెంకటేశం, యాదగిరి, యువజన సంఘం అధ్యక్షులు వంశీకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.