Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- చేవెళ్ల
సీపీఐ మహాసభలను విజయవంతం చేయాలని సీపీ ఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం ప్రభు లింగం, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే రామస్వామి అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలో సీపీిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం ప్రభు లిం గం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కే రామస్వామితో కలిసి వాల్పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ ..కేంద్రంలో మోడీ అవలంబిస్తున్న ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు మతోన్మాదానికి పరిరక్షణకు పోరాడాలని కోరారు. సీపీఐ 24వ జాతీయ మహాసభలు అక్టోబర్ 14 నుంచి 18 వరకు విజయవాడలో జరుగుతున్నాయని తెలి పారు. ఈ మహాసభలు మొదటి రోజు పెద్ద బహిరంగ సభ ఉంటుందని ఈ బహిరంగ సభను జిల్లాల నుంచి అత్యధికమైన సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కౌన్సిల్ సభ్యుడు ఎం సుధాకర్, గౌడ్, సీపీఐ మండల కార్య దర్శి సత్తిరెడ్డి, సీపీఐ నాయకులు మల్లేష్, కృష్ణగౌడ్, భుజం గారెడ్డి, మహిళా సంఘం నాయకులు ఏం మంజుల, మీనా క్షి, విజయమ్మ, అనసూయ, ఎండి షఫీ, సత్తయ్య తది తరులు పాల్గొన్నారు.