Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చంద్రమోహన్ సీఐటీయూ జిల్లా
- కార్యదర్శి రంగారెడ్డి జిల్లా
నవతెలంగాణ-కొత్తూరు
ఈ నెల 15,16వ తేదీల్లో కొత్తూర్ మండల కేంద్రం లో జరిగే సీఐటీయు రంగారెడ్డి జిల్లా 3వ మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి చంద్రమోహన్ పిలుపునిచ్చారు. కొత్తూరులో జరిగే సీఐటీయూ మహాసభల నేపథ్యంలో మంగళవారం స్థానిక ఐఓసీఎల్ ప్రాంగణంలో ఐఓసీఎల్ డ్రైవర్స్ యూ నియన్ జనరల్‌బాడీ సమావేశం సీఐటీయూ జిల్లా నాయ కులు సాయిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశా నికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఆయన మా ట్లాడుతూ...సీఐటీయూ కార్మికవర్గ హక్కల కోసం కృషి చే స్తుందన్నారు. కొత్తూర్ పారిశ్రామికవాడలో నిత్యం ఏదో ఒక రూపంలో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటు న్నారని, అందుకు కార్మికవర్గం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రానున్న కాలంలో కార్మికుల సమస్యలపై చేయాల్సిన పోరాటాలకు రూపకల్పన మహాసభలో చర్చిం చుకుని భవిషత్ ఉద్యమాలకు పూనుకోవాలన్నారు. కొత్తూరు పారిశ్రామిక వాడలో సీఐటీయు సంఘాన్ని బలో పేతం చేయాలని, అందుకు ఐఓసీఎల్ కార్మికులు తమవం తు సహాయ సహకారాలు అందించాలని కోరారు. పారిశ్రా మిక ప్రాంతంలో కార్మికులంతా ఐక్యంగా ఉండి కార్మికవర్గ ఐక్యతను చాటాలన్నారు. అందుకు కొత్తూర్ పారిశ్రామిక ప్రాంతంలో నిర్వహిస్తున్న మహాసభలకు ఐఓసీఎల్ డ్రైవర్స్ యూనియన్ ముందుండి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ జనరల్ సెక్రటరీ లింగం, శ్రీను, బాబు, రవి, గోపాల్ పాల్గొన్నారు.