Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ యువ నాయకులు పి. కార్తిక్ రెడ్డి, మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్
- పాలమాకులలో మాజీ మంత్రి ఇంద్రారెడ్డికి ఘన నివాళి
నవతెలంగాణ- శంషాబాద్
రాజకీయ రంగంలో తనకంటూ ప్రత్యేక ముద్రవేసి చరిత్రను సృష్టించిన మహనీయుడు మాజీ మంత్రి పి.ఇం ద్రారెడ్డి చిరస్మరణీయుడని టీఆర్ఎస్ యువ నాయకుడు పి.కార్తిక్‌రెడ్డి, మాజీ ఎంపీపీ, పెద్ద షాపుర్ ఎంపీటీసీ చెక్క ల ఎల్లయ్యముదిరాజ్ అన్నారు. మంగళవారం మాజీ మంత్రి దివంగత పి. ఇంద్రారెడ్డి 68వ జయంతి కార్యక్ర మం శంషాబాద్ మండలంలోని పాలమాకుల గ్రామంలో ఘనంగా జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇంద్రారెడ్డి మరణించిన చోట ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి కార్తీక్ రెడ్డి, ఎల్లయ్యతో పాటు టీఆర్ఎస్ నాయకులు, కా ర్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూలమా లలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు కార్తీక్ రెడ్డితో కలిసి మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య ముదిరాజ్ మాట్లాడుతూ ఇంద్రారెడ్డితో ఉన్న తన అనుబంధాన్ని తన రాజకీయ ప్రస్థానాన్ని గురించి గుర్తు చేసుకున్నారు. ఇంద్రారెడ్డి లాంటి సమర్ధుడైన, ధైర్య సాహసాలు కలిగిన నాయకుని చేతిలో వందలాది మంది కార్యకర్తలు నాయకులుగా ఎదిగార న్నారు. ఆయన అడుగుజాడల్లో రాజకీయ ఓనమాలు నేర్చుకున్నానని ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను నిరంతరం పరిష్కరించుకుంటూ పోతే ప్రజలు ఆదరి స్తారని అన్నారు. ఆయన మరణించి రెండు దశాబ్దాలు దాటినా ఆయన అడుగుజాడల్లోనే ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. గుండె నిబ్బరం, కలిగిన మహానేత ఇంద్రన్న రాజకీయ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవా లని సూచించారు. ఎంతటి కఠిన సవాళ్లు అయినా ఎదు ర్కొనే వ్యక్తిత్వం శక్తి యుక్తులు వాక్చాతుర్యం ఇంద్రారెడ్డి సొంతమ ని అన్నారు. అసెంబ్లీ లోపల, బయట ఎక్కడ ఏ అంశాలు మాట్లాడిన ప్రజలకు అర్థవంతమైన రీతిలో వివరించే గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన జీవితం గురుంచి నేడు రాజకీయాల్లోకి కొత్తగా వస్తున్న యువతరం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఇంద్రారెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఆయన సతీమణి తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, యువ నాయకుడు కార్తీక్ రెడ్డి ముందుకు సాగుతున్నారని తెలిపారు. తను నాటికి, నేటికి, ఎప్పటికీ ఇంద్రారెడ్డి శిష్యుడుగానే ఉం టానని అదే తనకు సంతృప్తినిస్తుందని అన్నారు. ఈ కార్య క్రమంలో ఎస్ఎస్సిఎస్ చైర్మన్ కే.శ్రావణ్‌కుమార్‌గౌడ్, పెద్ద షాపూర్ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్‌ముదిరాజ్, పాల మాకుల ఎంపీటీసీలు గుడాల ఇందిరా కృష్ణగౌడ్, సరితా రవీందర్, కేంద్ర ప్రభుత్వ ప్రాసెసింగ్ మాజీ సభ్యులు గుర్రంపల్లి శ్రీనివాస్ యాదవ్, పాలమాకుల ఉపసర్పంచ్ ప్రవీణ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ఆంజనేయులుగౌడ్, తదితరులు పాల్గొన్నారు.