Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ కె. నిఖిల
నవతెలంగాణ వికారాబాద్ కలెక్టరేట్
జిల్లాలోని పోడు భూముల శాశ్వత పరిష్కారం కోసం సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె. నిఖిల అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోడు వ్యవసాయ భూముల పురోగతి, చేపట్టాల్సిన పనులపై అటవీ శాఖ అధికారులు, తహస ీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచా యతీ కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోడు భూముల్లో దీర్ఘకాలంగా ఉన్న వారందరికీ న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 10 తేదీలోపు వచ్చే అర్జీలు అన్నిటిని క్షేత్రస్థాయిలో వెళ్లి పూర్తిగా ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తక్కువ అర్జీలు ఉన్నటువంటి బంట్వారం, తాండూర్ , నవాబ్ పేట్, దౌల్తాబాద్ , మర్పల్లి మండలాల్లో ఐదు రోజులలోపు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత తహసీల్దార్లను ఆదేశించారు. మిగతా 14 మండలాల్లో ధ్రువీ కరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు షెడ్యూల్స్ అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి హ్యాబిటేషన్లో అటవీ హక్కుల కమిటీ సమావేశాలను ఏర్పాటు చేయాలని అందులో తహసీల్దార్లు, ఎంపీ డీవోలు తప్పనిసరిగా ఉండాలన్నారు. అదే విధంగా గ్రామ పంచాయతీ సర్పం చులను,వార్డు మెంబర్లను భాగస్వామి చేయా లని ఆమె సూచించారు. గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసే ముందు రోజు చాటింపు చేయాలని తెలి పారు. ప్రతిరోజూ ఎఫ్ఆర్సి కమిటీలు తప్పనిసరిగా ధ్రువీకరణకు వెళా ్లలని, అలాగా ధ్రువీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. పంచాయతీ కార్య దర్శులు మొబైల్ యాప్లో డేటాను వేేయా లని ఆదేశించారు. ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అధికారులు ఎవరు కూడా ఎక్కడికీ వెళ్లకూడని తెలిపారు. తప్పని పరిస్థితిల్లో పై అధికారుల అనుమతి తీసుకో వాలని వెళ్లాలని కలెక్టర్ సూచించారు. ధ్రువీకరణ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా అతి జాగ్రత్తగా చేపట్టాలని అధి కారులకు సూచించారు. ఈ సమావేశంలో అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి రెవెన్యూ అధికారి అశోక్ కుమార్, వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి, గిరిజన అభివృద్ధి అధికారి కోటాజితో పాటు అటవీ శాఖ అధికారులు, తహసీల్దారులు, ఎంపీవోలు తదితరులు పాల్గొన్నారు.