Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాడ్గుల
మాడ్గుల మండల కేంద్రంలో ప్రతిష్టించిన దుర్గామాత అమ్మవారి ముగింపు శోభయాత్ర హట్ట హాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బతు కమ్మ, కోలాటలు, ఆటపాటలు, బ్యాండ్ బాజాల కోలాహలం నడుమ అమ్మవారి నిమ్మజన కార్య క్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా భవాని ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాట కార్యక్రమంలో మొదటి లడ్డూ మహా ప్రసాదం గ్రామానికి చెందిన ఎస్ ఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ సూదిని నారాయణా రెడ్డి గత రికార్డులను బ్రేక్ చేస్తూ రూ.5,11వేలకు దక్కించుకున్నారు. అదేవిధంగా అమ్మవారి 3.5 గ్రాముల ముక్కుపుడకను రూ. 80,116 లకు దన్విక డెవలపర్ వారు దక్కించుకోగా, అమ్మా వారి లక్ష్మి మాలను కంచర్ల వెంకట గిరి రూ.లక్షా18 వేలు, కలుశం, అమ్మవారి పూజా విగ్రహం ఏరుకలి శివ రూ.90,వేలకు, రెండోవ లడ్డు లక్కీ డ్రా ద్వారా విజేత డేరంగుల భవని సొంతం చేసుకున్నారు.
తొమ్మిది రోజుల అలంకరణలోనీ అమ్మవారి చీరెలను 1 బాల త్రిపుర సుందరిదేవీ అలంకరణ లోనీ చీరను దండుగుల జంగయ్యా రూ.30 వేలుకు, రెండోవ రోజు గాయిత్రి దేవి చీరెను దండు గుల బిక్షపతి రూ. 27,100, మూడోవ రోజూ అన్న పూర్ణ దేవీ అవతారంలోని చీరెను వరికుప్పల శేఖర్ రూ.21వేలు, 4వ రోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలోనీ చీరెను కొరటి నర్సింహారెడ్డి, మహాలక్ష్మి అలంకరణ గావించ బడిన చీరెని గౌనీ వెంకటేష్ గౌడ్ రూ.25,116, 6వ రోజు భువనేశ్వరి మాత చీరెను కొత్తపల్లి ముచ్చం గౌడ్ రూ.25,116 లకు, 7వ రోజూ చదువుల తల్లి సరస్వతి దేవి అలం కరణలోనీ చీరెను రూ.28,116లకు బత్తుల మధుకర్ రెడ్డి, 8వ రోజు దుర్గ దేవి అలంకరణలోనీ చీరేను సూదిని విష్ణు వర్ధన్ రెడ్డి, 9వ రోజు మహిశసుర మర్ధిని అలంకరణ లోని చీరెను పబ్బు శ్రీనివాస్ గౌడ్, చివరి రోజు రాజ రాజేశ్వరి దేవీ అవతారంలోని చీరెను దేరంగుల గణపతి రూ.26 వేలకు దుర్గా భవాని భక్తులు వేలం పాట ద్వారా పొందారు. అనంతరం దుర్గామాతను గ్రామ సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున 2 వేల మంది భక్తులు, నిర్వాహకులు పాల్గొన్నారు.