Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్
నవతెలంగాణ-మర్పల్లి
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశంలోనే ఆదర్శమని వికారాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం కోట మర్పల్లి గ్రామానికి చెందిన కావాలి నర్సింహలుకు దళితబంధు పథకం ద్వారా మంజూరైన షిఫ్ట్ డిజైర్ కారును, జంషెడ్పూర్ గ్రామానికి చెందిన యాదయ్యకు మంజూరైన వాహనాన్ని ఆయన శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆకర్ దళితబంధు పథకం ప్రవేశపెట్టి ఒక్క కుటుంబానికి ఒకే సారి 10 లక్షల రూపాయలు ఇవ్వడం చాలా గర్వించదగ్గ విషయమన్నారు.దళిత బంధు పథకం ద్వారా వచ్చిన యూనిట్‌తో ఆర్థికంగా అభివృద్ధి కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జంషెడ్పూర్ సర్పంచ్ నూరుద్దీన్, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాచయ్య, మాజీ ఉప సర్పంచ్ జె అశోక్, జైహింద్ రెడ్డి, వార్డు మెంబర్,తహసీన్ గ్రామ అధ్యక్షులు, ఖాదీర్, సంపత్, నర్సింహా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.