Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చందనవెళ్లి భూ బాధితులు
నవతెలంగాణ-షాబాద్
భూ బాధితులకు న్యాయం చేయటంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెందిన వెళ్లి భూ బాధితులు ఆరోపించారు. తమకు న్యాయం జరగాలని చేపట్టిన దీక్ష శుక్రవారంతో 69 వ రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరంలో భూ నిర్వాసితుల సంఘం గౌరవ అధ్యక్షుడు వేమారెడ్డి, అధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ... బాధిత రైతులకు సమస్య పరిష్కారం చేస్తామని రమ్మని చెప్పిన చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్ పరిష్కరించకుండా సమస్యను నీరుగార్చేలా వ్యవహరిస్తున్నాడని అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. భూములు కోల్పోయిన వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు ఓసీలకు చెందిన నిరుపేదలు కూడా ఉన్నారన్నారు. 175 ఎకరాలకు నష్టపరిహారం ఇచ్చే వరకు పోరాటం ఆపేది లేదని తేల్చి చెప్పారు.ఇన్ని వర్గాలకు చెందిన సుమారు వంద మంది రైతులకు న్యాయం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొంతమంది అక్రమార్కులు వంతపాడుతూ వారి పక్షాన మాట్లాడటం సరికా దన్నారు. తమకు న్యాయమైన పరిహారం అందే వరకు ఎవరికీ భయపడేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపా ధ్యక్షులు రెడ్డయ్య, నర్సింలు, అప్పలి అంతయ్య, గిరిబాబు, ప్రధాన కార్యదర్శి, అనంతం, ఎల్లేష్, శోభ, నర్సింలు, సభ్యులు, బాలయ్య, దయాకర్, ఆంజయ్య, బాలమ్మ, రంగం, కిషన్, లంబాడి చావలి, బాలకృష్ణ, తదితరులు, రైతులు పాల్గొన్నారు.