Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగే శ్రీనివాస్
నవతెలంగాణ-కొడంగల్
వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుండి రేవంత్ రెడ్డి పోటీ చేయాలని ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కొడంగల్ రేవంత్ రెడ్డికి గుర్తుకు వచ్చిందా అని బిఆర్ఎస్ నియోజకవర్గ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగే శ్రీనివాస్, యువ నాయకులు నరేష్ అన్నారు. దుద్యాల మండలంలో బిఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ మడిగే శ్రీనివాస్, నాయకులు నరేష్‌లు విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేండ్లు గా కొడంగల్ నియోజకవర్గ ప్రజలు గుర్తుకు రాలేదా, ఎన్నికల సమయం దగ్గర వస్తుండడంతో కోడంగల్ ప్రజల కు మాయ మాటలు చెప్పి రాజకీయ లబ్ధి పొందడానికి రేవంత్ రెడ్డి మళ్లీ డ్రామా ప్రారంభించారన్నారు, అసెంబ్లీ ఎన్నికల్లో కోడంగల్ నుండి రేవంత్ రెడ్డి ఓటమి చెందిన తర్వాత కోడంగల్ కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కోడంగల్ ప్రజలను కలిసిన పాపన్న పోలేదన్నారు, ఇప్పటికిప్పుడే కోడంగల్ ప్రజలు గుర్తుకు రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పదేండ్లుగా కొడంగల్ ఎమ్మెల్యేగా పనిచేసిన రేవంత్ రెడ్డి కొడంగల్‌ను ఏమి అభివృద్ధి చేశారో చెప్పలేదన్నారు. అభివృద్ధి కార్యక్ర మాలు చేపడితే టిఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకున్నట్లు మాట్లాడుతున్నావ్ నిరూపణ చేయాలని సవాల్ విసిరారు. గడిచిన నాలుగేండ్లలో కొడంగల్ గురించి ఎక్కడ చర్చిం చిన పాపన పోలేదన్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కొడంగల్ అభివృద్ధి పథంలో ముందుకు వెళుతు నియోజకవర్గ ప్రజలు నరేందర్ రెడ్డి వెంబడి ఉండడం చూసి ఓర్వలేకనే ఇష్టం వచ్చినట్లు మా ట్లాడుతున్నారన్నారు. కోడంగల్ ప్రజలు అభివృద్ధి చేసే నా యకుడి వెంబడి ఉంటారు తప్ప మాటలు చెప్పే నాయ కుల వెంబడి ఉండారన్నారు. నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజు నుండి నేటి వరకు ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల హదయా ల్లో స్థానం సంపాదించిన నాయకుడు నరేందర్ రెడ్డి అన్నా రు. లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని హిత వు పలికారు, కార్యక్రమంలో మైనార్టీ అధ్యక్షులు జావిద్, బసిరెడ్డి, సాయిలు, ఉపసర్పంచ్ కేశవులు, మార్కెట్ డైరెక్టర్ హైమద్ పాషా, చాంద్ పాషా, రాములు, బుగ్గప్ప తదితరులు పాల్గొన్నారు.