Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టిపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ-కోడంగల్
వీఆర్ఏల ఉద్యోగానికి భద్రత కల్పించకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాన్ని ఉడగొడతామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. కోడంగల్ లోని మండల తహసిల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏల దీక్షకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ాలలో ప్రభుత్వాలకు ప్రజలకు అనుసంధానంగా సేవలు అందిస్తున్న వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. చాలీచాలని వేతనాలతో అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామ న్నారు. వీఆర్ఏలు ఆవేశపడి ఆత్మహత్యలకు పాల్పడో దన్నారు. 75 రోజులుగా వీఆర్ఏలు కెసిఆర్ ఇచ్చిన హామీ లను నెరవేర్చమంటున్నారు తప్ప కొత్త కోరికలు కోరడం లేదన్నారు. ఇతర శాఖలలో వారికి అవకాశం కల్పించి వారి కి జీతభత్యాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పార్టీని విస్తరించుకోవడానికి, పార్టీని కాపాడుకోవడానికి ఎన్ని రకాల కార్యక్రమాలు అయినా చేపడుతారు వీఆర్ఏల సహజమైన కోరికలపై మంత్రులను పంపించి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలన్నారు. వీఆర్ఏలకు కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా మద్దతు తెలుపుతామన్నారు. గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి కోడంగల్ పెద్ద చెరువు పాటు కాలువ తెగిపోవడంతో బాలాజీ నగర్, కుమ్మరి వాడలో ఇళ్లలోకి వరద నీరు చేరిన విషయం తెలు సుకున్న ఆయన అక్కడికి చేరుకొని బాధితులతో మామాట్లాడారు. వెంటనే బాధితులకు పదివేల రూపాయలు, బి య్యం అందించాలని ఫోన్ ద్వారా అధికారులతో మాట్లా డారు. మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఏండి యూసుఫ్, నందారం ప్రశాం త్, కష్ణంరాజు, రెడ్డి శ్రీనివాస్, నయుం, దాము, సోమ శేఖర్, శంకర్ నాయక్, తార్య నాయక్, రాము, రమేష్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.