Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఆర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజల కోసం వంద పడకల ఆస్పత్రి
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
- కాబోయే సీఎం రేవంత్ రెడ్డి
- మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి
నవతెలంగాణ-పరిగి
శుక్రవారం పరిగి పట్టణ కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి కుమారుడు టిఆర్ఆర్ ఇనిస్టిట్యూట్ట్ మెడికల్ సైన్స్ వైస్ చైర్మన్ రిత్విక్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. రేవంత్ రెడ్డి తో కలిసి రిత్విక్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రామ్మోహన్ రెడ్డి ఇక్కడి ప్రాంత ప్రజలకు కోసం తన ఆస్తులను సైతం లెక్కచేయకుండా ఖర్చు పెట్టి సేవలు అందిస్తున్నాడని తెలిపారు. వైద్యం కోసం వచ్చిన, విద్య కోసం వచ్చిన కాదనకుండా తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నాడని అన్నారు. ఇక్కడి ప్రాంత అభివద్ధి కోసం ఎమ్మెల్యే కాకపోయిన మన్నెగూడ నుండి బీజాపూర్ వరకు నేషనల్ హైవే ను తీసుకురావడానికి ఎంతోకృషి చేశారని తెలిపారు. ఈ ప్రాంతానికి రైల్వే లైన్ రావాలని కేంద్ర మంత్రి మునియప్ప ను తీసుకువచ్చి సర్వేలు చేయించి 50% మంజూరు చేయించిన ఘనత రామ్మోహన్ రెడ్డి కె దక్కుతుందని అన్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోయిల్ సాగర్ ద్వారా తాగునీటి పథకాన్ని 150 కోట్లతో కోడంగల్ వరకు తీసుకు వస్తే, రామ్మోహన్ రెడ్డి నాటి మంత్రి సబిత ఇంద్రారెడ్డి తో కొట్లాడి మరి కోడంగల్ నుండి కోయిల్ సాగర్ జలాలను పరిగి వరకు పొడిగించుకున్నాడని అన్నారు. అదేవిధంగా 400 కెవి సబ్‌స్టేషన్, చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టును పరిగి వరకు పొడిగించడం కోసం ఎంతో కషి చేశారని అన్నారు. టిఆర్ఎస్ సొంత భూములు అమ్మి , ఈ ప్రాంత అభివద్ధికి ఖర్చు పెడుతుంటే ఇక్కడున్న ఎమ్మెల్యే సొంత భూములు, చుట్టాల భూములే కాకుండా గుడి భూములు కూడా ఆక్రమిస్తూ గుడినే కాదు గుడిలో లింగాన్ని మింగే విధంగా ఉన్నాయని ఆయన ఎద్దేవ చేశారు. 2014 నుండి 2019 వరకు ఈ ప్రాంత సమస్యల పైన రామ్మోహన్ రెడ్డి శాసనసభలో ఎన్నోసార్లు మాట్లాడారు.
కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలో కనీసం ఒక్కసారైనా లేచి అధ్యక్షా అని అన్నాడు అని ప్రశ్నించారు. దళిత బంధు, రైతు బంధు, ఏ బంధు పథకం వచ్చినా ఈ బందుకు కొంచెం వాటా ఇవ్వాల్సిందేనని విమర్శించారు. ఈ ఎమ్మెల్యేకు జేబులు లేవు కానీ జోలె మాత్రం ఉందన్నారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్ధిపేటోని అడుక్కునేది లేదు ఏది ఏమైనా ఇక్కడినుండే రాష్ట్రాన్ని శాసిద్దాం అని పిలుపునిచ్చారు. వికారాబాద్ గడ్డపై నుండి సంతకం చేసి రాష్ట్రాన్ని శాసించే రోజు వస్తుందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచినప్పుడే రాష్ట్రాన్ని శాసించే అధికారం వస్తుందని తెలిపారు. రిత్విక్ రెడ్డి వారి నాయనమ్మ ఆశయాల కోసం డాక్టర్ చదివి విదేశాలకు వెళ్లకుండా హైదరాబాద్‌లో చదివి తండాలోని లంబాడీ సోదరుల కోసం, దళితవాడలోని పేద ప్రజల కోసం సేవలందించేందుకు ముందుకు వచ్చినందుకు అభినందించారు. పరిగి నియోజక వర్గ ప్రజల కోసం వంద పడకల ఆసుపత్రిని నిర్మించి సేవను అందించే లక్ష్యంతో ముందుకు వచ్చిన రామ్మోహన్ రెడ్డి కుటుంబానికి మనమందరం అండగా నిలబడాలని అన్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికి రావాల్సిన అభివద్ధిని సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని అన్నారు. చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు ను రీడిజైన్ పేరుతో ఇక్కడి ప్రాంత రైతుల పొట్టలు కొట్టి తన ప్రాంతానికి తీసుకువెళ్లారని విమర్శించారు. రైల్వే లైన్‌కు నిధులు కేటాయించకుండా ఫైళ్లు పెండింగ్ లో పెట్టాడని తెలిపారు.రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైందని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వికారాబాద్ జిల్లా ను అన్ని రంగాల్లో అభివద్ధి చేస్తామని తెలిపారు. ఆర్ఆర్ ఇనిస్టిట్యూట్ట్ మెడికల్ సైన్స్ వైస్ చైర్మన్ రిత్విక్ రెడ్డి మాట్లాడుతూ టిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయడం కాదు వారిపై మాకు ఉన్న బాధ్యత అని గుర్తు చేశారు. కొడంగల్, మల్కాజ్గిరి ప్రాంతాలకు చెందిన వారికి ఎవరికైనా విద్యను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.