Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 'మీతో నేను' కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని జైదుపల్లిలి గ్రామంలో శుక్ర వారం పర్యటించారు. రైతులు జైదుపల్లి గ్రామాన్ని మైలారం దేవరంపల్లి రైతు వేదిక క్లస్టర్ నుండి గొట్టిముక్కుల రైతు వేదిక క్లస్టర్‌కు మార్చాలని కోర గా ఎమ్మెల్యే వెంటనే వ్యవసాయ శాఖ అధికారు లతో మాట్లాడి మైలారం దేవరంపల్లి క్లస్టర్ నుండి గొట్టిముక్కుల క్లస్టర్ కు మార్చాలని వ్యవసాయశాఖ అధికారులతో మాట్లాడారు. మిషన్ భగీరథ మంచి నీటి పైపు లైన్లు ఎక్కడా లీకేజీలు లేకుండా, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి, గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి, ప్రజలకు పరిశుభ్రమైన తాగునీటిని అందించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతిలో కూల్చివేయని పాడు బడ్డ ఇండ్లను తొల గించాలని అన్నారు. నెలలో మూడు సార్లు 1, 11, 21వ తేదీల్లో మిషన్ భగీరథ తాగు నీటి ట్యాంకు లను కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు. మిషన్ భగీ రథ మంచి నీటిని ప్రజలందరూ..తాగాలని అందు కు మిషన్ భగీరథ అధికారులు అవగాహన కల్పిం చాలన్నారు. జైదుపల్లి గ్రామ సమీపంలోని మైసమ్మ కుంటలో నుండి విద్యుత్ లైన్‌ను సైడ్‌కు మార్చా లని, గ్రామంలో థర్డ్‌వైర్ ఏర్పాటు చేసి, తదితర విద్యుత్ సమస్యలు పరిష్కారం చేయాలనని, విద్యు త్‌శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రా మంలో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ లబ్దిదారులను సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ ఎస్ మండల అధ్యక్షుడు ఎన్ కమల్ రెడ్డి, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, సర్పంచ్ ఎల్లమ్మ, ఉప సర్పంచ్ సురేష్ ముదిరాజ్, ఎండిఓ సత్తయ్య, తహసీల్దార్ షర్మిల, లక్ష్మణ్, అనంతయ్య, ప్రజా ప్రతి నిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్య కర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.