Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల డివిజన్ కన్వీనర్ అల్లి దేవేందర్
నవతెలంగాణ- చేవెళ్ల
ఈనెల 15, 16 తేదీల్లో జరిగే సీఐటీయూ జిల్లా మహాసభలను శుక్రవారం చేవెళ్ల లో పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ చేవెళ్ల డివిజన్ కన్వీ నర్ అల్లి దేవేందర్ మాట్లాడుతూ.. సీఐటీయూ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభను విజయ వంతం చేయాలని పోస్టర్ను ఆవిష్కరిస్తూ పిలుపునిచ్చా రు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్మికులు బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి కార్మికుల హక్కులను కాలరాస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 53 షెడ్యూల్ ఎం ప్లాయ్మెంట్ జీవోలను సవరించకుండా గెజిట్ చేయ కుండా కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. చేవెళ్ల డివిజన్లో అనేక కంపెనీలకు కార్మిక చట్టాల ప్రకారం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని కంపెనీలకు కనీసం బోర్డులు కూడా లేవని ఫైర్ సేఫ్టీ లేదు ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం లేదు 12 గంటల పని చేయిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరిగినా కార్మికశాఖ అధికారులు స్పందించ డం లేదని అన్నారు. కార్మికుల సమస్యల పై ప్రభుత్వాలతో ఏ విధంగా పోరాటం చేయడానికి దిశా నిర్దేశం చేసుకోవ డానికి కొత్తూరులో ఈనెల 15 ,16 తేదీలలో సిఐటియు రంగారెడ్డి జిల్లా మహాసభలు జరుగుతున్నాయని మహాస భలను విజయవంతం చేయవలసిందిగా కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్య దర్శి ఎర్రవల్లి శ్రీనివాస్, సిఐటియు నాయకులు బాలకృష్ణ, జంగయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.