Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు నిట్ట నారాయణ
నవతెలంగాణ-ఆమనగల్
కేసీఆర్ సేవలు దేశానికి అవసరమని అప్పుడే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలౌతాయని రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు నిట్ట నారాయణ అన్నారు. శుక్రవారం ఆj న నవతెలంగాణాతో మాట్లాడారు. తరతరా లుగా దోపిడీకి గురవుతున్న తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేయాలని 14 ఏండ్లు అవిశ్రాంత పోరాటం చేసిన యోధుడు సీఎం కేసీఆర్ అని ఆయన గుర్తుచే శారు. ప్రత్యేక రాష్ట్రం సాధించి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అన్ని రంగా ల్లో అగ్రస్థానంలో నిలిపిన ఘనత కేసిఆర్‌కే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్యలతో మద్దతు ధరలేక రైతులు ఎన్నో ఒడి దుడుకులను ఎదుర్కొంన్నారని ఆ యన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు, ఆసరా పించన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాం టి అనేక పథకాలు ప్రవేశపెట్టడం కేసీఆర్ కే సాధ్యమైందని అన్నారు. విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశ పురోభివృద్ధి సాధ్యమవుతుందని నిట్ట పేర్కొన్నారు.