Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అత్యవసర సమయంలో 100 డయల్ చేయండి
- ఎస్సై మధుసూదన్ రెడ్డి
నవతెలంగాణ-తాండూరు రూరల్
మూడురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి అత్య వసరమైతేనే బయటకు వెళ్లాలని కరణ్ కోట్ ఎస్సై మధుసూదన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు జాగ్ర త్తగా వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటి రెడ్డి ఆదే శాల మేరకు కింది సూచనలు తప్పనిసరిగా పాటించా లని తెలిపారు. తాండూర్ మండల గ్రామీణ పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లోని పాత ఇల్లు, గుడిసెలలో, శిథిలావస్థలో ఉన్న నివాసా లలో ఉండే ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని, గ్రా మాల్లో పెద్దలు తమ పిల్ల లను వాగుల వైపు వెళ్ళని వ్వకుండా చూడాలని తెలి పారు. వాగులు వంకలలో నీటి ప్రవాహంతో పొంగి పొర్లు తుండటంతో ఆయా ప్రాంతాలు అప్రమత్తంగా ఉండా లని కోరారు. పాత మిద్దెల కింద, పాత గోడల పక్కన ఎవ్వ రూ ఉండకూడదని, తడిసిన స్తంభాలను పట్టుకోవద్దని విద్యుత్ మీటర్లను ముట్టుకోవద్దని, ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులను తాకవద్దని తెలిపారు. పొడిగా ఉన్న చిన్న కర్ర లేదా ప్లాస్టిక్ వస్తువులతో స్విచ్ వేయాలని, చిన్న పిల్లలను కరెంటు వస్తువుల దగ్గరికి పోనివ్వద్దని కోరారు. ఏదైనా ఘ టన జరిగితే డయల్ 100 కికాల్ చేయాలని సూచించారు.