Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్ పర్సన్‌కు కౌన్సిలర్ల ఫిర్యాదు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని ఖానాపూర్ గ్రామ పరిధిలో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ సంస్థ నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు చైర్ పర్సన్ కప్పరి స్రవంతి చందు, కమిషనర్ మహమ్మద్ యూసఫ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా కౌన్సిలర్లు ఈర్లపల్లి సునీత వెంకట్ రెడ్డి, ఆకుల మమత ఆనంద్, సుల్తానా బేగం, మోహన్ నాయక్, పంది శంకరయ్య, నరాల విశాల విద్యాసాగర్ మాట్లాడుతూ గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎలాంటి పర్మిషన్లు లేకుండా నిర్మిస్తున్న కట్టడాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రతి బిల్డింగ్ పై అనుమతి తీసుకోవడం లేదని చెప్పారు. ఫలితంగా మున్సిపాలిటీకి లక్షల రూపాయల ఆదాయానికి గండి పడుతుందని చెప్పారు. అధిక సంఖ్యలో అక్రమంగా అక్రమ కట్టడాలు కడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారని చెప్పారు. పాత కట్టడాలపై మరొక్కసారి అసైన్మెంట్ చేయాలన్నారు. మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొట్టకుండా చేయాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. అందుకు స్పందించిన చైర్మన్ మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.