Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
పీఆర్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డికి పిఆర్టియు సంఘం నాయకులు ఆత్మీయ సన్మానం చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి ఇబ్రహీంపట్నం వచ్చారు. ఇబ్రహీంపట్నం చెరువు వద్ద జల పూజ నిర్వహించారు. అనంతరం మైసమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కుంకుమ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఉపాధ్యాయులందరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు.. మార్చిలో జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ నియోజకవర్గ వాసిగా 36 సంవత్సరాల ఉపాధ్యాయ సర్వీస్ ఉపాధ్యాయ వృత్తికే వన్నె తెచ్చే విధంగా మండల, జిల్లా అధ్యక్షులుగా, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిచటం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాజు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, నారాయణ్ రెడ్డి, రాంభూపాల్ రెడ్డి, మండల విద్యాధికారి వెంకట్రెడ్డి, జిల్లా మాజీ గౌరవాధ్యక్షులు నారాయణ, సరూర్ నగర్ మండల అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి, రాధాకృష్ణారావు, రేష్ జిల్లా మండల బాధ్యులు వేణు మాధవ్ రెడ్డి, రామ్మోహన్, మహెందర్ రెడ్డి ,ప్రశాంత్, రంగా రెడ్డి, ఆనంద్ కుమార్, సరస్వతి, మాధవి లత, భాస్కర్, యాదగిరి రెడ్డి, ఆంజనేయులు, ప్రదీప్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెంకటేష్, శ్రీరాములు, శ్రీను, అచ్చి రెడ్డి, బీరప్ప, చంద్రశేఖర్, జంగయ్య, శ్రీధర్, నరసింహ, కర్ణకార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.