Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాహనాలకు సరైన ధ్రువపత్రాలు లేని 65వాహనాలను సీజ్ చేసిన పోలీసులు
- ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
- తాండూరు డి.ఎస్.పి శేఖర్ గౌడ్
నవతెలంగాణ-తాండూరు
వాహనాలు నడిపేవారు అందరూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తాండూరు డిఎస్పి శేఖర్ గౌడ్ అన్నారు. గురువారం తాండూరు పట్టణ కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ వాహనాల తనిఖీ కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు కొనసాగించారు. తాండూర్లోని విలియం మూన్ చౌరస్తా మరియు శివాజీ చౌరస్తాలో పోలీసు వారు టూ వీలర్స్( మోటార్ సైకిల్ల) పైన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్స్ లేనటువంటి వెహికల్స్ ని, నెంబర్ ప్లేట్స్ సరిగా లేనటువంటి వెహికల్స్ని, రిజిస్ట్రేషన్ చేసుకోకుండా టీఆర్ పేపర్లపై తిరుగుతున్నటువంటి వెహికల్స్ని అన్నింటిని 65 వెహికల్స్ సీజ్ చేశారు. ఇకముందు కూడా నెంబర్ ప్లేట్స్ లేకుండా తిరుగుతున్నటువంటి వెహికల్స్ పైన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వెహికల్స్ ని సీజ్ చేయడం జరుగుతుంది అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరు నెంబర్ ప్లేట్స్ లేనటువంటి వెహికల్స్ కి నెంబర్ ప్లేట్స్ వేయించుకోవాలి అన్నారు. రిజిస్ట్రేషన్ చేయనటువంటి వెహికల్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి, ఎస్సై వేణుగోపాల్ గౌడ్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.