Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోటి 46 లక్షలతో పనులకు శ్రీకారం
- రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
నవతెలంగాణ-గండిపేట్
బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ నగరానికి ధీటుగా అభివృద్ధి చేస్తామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ అన్నారు. గురువారం గండిపేట్ మండలం బండ్లగూడ కార్పొరేషన్‌లోని 9,10,11,18,19,20వ వార్డుల్లో డ్రయినేజీ, సీసీ రోడ్ల అభివృద్ధి పనులకు మేయర్ మహేందర్ గౌడ్, కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని అన్ని బస్తీలను అభివృద్ధి చేస్తామన్నారు. నగరానికి ధీటుగా శివారు మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మౌలిక వసతులను కల్పించే దశగా టీఆర్ఎస్ సర్కారు పని చేస్తుందన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు తెలిపారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో ఎలాంటి సమస్య లేకుండ చేస్తామన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు స్థానికి పాలక వర్గం కృషి చేయాలన్నారు. పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. మంచినీటి వసతి, డ్రయినేజీ, వీధి దీపాలు, రహదారులు ఏర్పాటుతో పాటు ప్రతి వార్డుకు పట్టణ ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పట్టణాన్ని సుందరీకరించే దిశగా అడుగులేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, మేయర్ మహేందర్‌గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు గోకరి సురేష్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ రాందాస్, కార్పొరేటర్లు పద్మావతిపాపయ్య శ్రీలతా, నిఖిల్ సంగారెడ్డి, శ్రీలతాసురేష్ గౌడ్, సాగర్ , ప్రశాంత్‌నాయక్, అస్తాంబి, కో-ఆప్షన్ సభ్యులు మాలకీ రత్నం, జగదీష్, నాయకులు పాపయ్యయాదవ్, నాగరాజు, గోపాల్ముదిరాజు, మల్లేష్‌యాదవ్, చేగూరి రాజు, సుమన్ గౌడ్, విష్ణువర్థన్, రాజు, కాలనీ వాసులు అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.