Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి తల్లిదండ్రులకూ పింఛన్
- 57 ఏండ్ల నిబంధనలతో అక్రమార్కులకు ఆసర
- ఉత్సాహపూరితంగా గుర్తింపు కార్డుల జారీ
- మళ్లీ జల్లెడ పడుతున్న అధికార యంత్రాంగం
- ఇప్పటికే 701 మంది మృతుల గుర్తింపు
- 2,238 మంది అనర్హత లబ్దిదారుల పింఛన్ల నిలిపివేత
- పింఛన్ల కోసం అర్హుల ఎదురుచూపులు
ఎలాంటి ఆసరా లేని వారికి అభయమిస్తూ ఆర్థిక వెసులుబాటును కల్పించేందుకు ఏర్పాటు చేసినదే పింఛన్ల పథకం దానికి తెలంగాణ ప్రభుత్వం ఆసరా అనే నామకరణం చేసింది. కానీ ఈ ఆసరా పథకం అనర్హుల జేబుల్లోకి వెళుతుంది. ఉద్యోగులకే ఆసరా అన్నట్టుగా మారుతుంది వాళ్ళ తల్లిదండ్రులకు పింఛన్లు అందజేస్తున్న వైనం రంగారెడ్డి జిల్లాలో నెలకొంది. 57 ఏండ్ల నిబంధనతో అక్రమార్కుల జేబుల్లోకి లక్షల రూపాయలు పింఛన్ల రూపంలో చేరుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్ల జారీ పేరుతో ఉత్సాహపూరితంగా గుర్తింపు కార్డును జారీ చేసింది. తర్వాత చేతులు పట్టుకుంటుంది. అనర్హులకు ఆసరా అందుతుండటంతో ఇప్పుడు ఏరివేతకు జల్లెడ పడుతుంది. ఈ ప్రకారం జిల్లాలో ఇప్పటికే సుమారు రెండు వేలకు పైగా అనర్హులను గుర్తించారు. వారికి జారీ చేయాల్సిన పింఛన్ డబ్బులను నిలిపివేశారు. ఇక నూతనంగా జారీ చేసిన కార్డుల జాబితాలో 701 మంది మృతులను గుర్తించారు. వారి డబ్బులను నిలిపివేశారు ఇంకా అనర్హుల జాబితాపై డిఆర్డిఓ అధికారులు జల్లెడ పడుతున్నారు. అయినా ఇంకా ఉద్యోగుల కుటుంబాల తల్లిదండ్రులకు పింఛన్లు అందుతున్నాయి అంటే ప్రభుత్వ నిర్వాహకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా అర్హత కలిగిన వితంతువులు వికలాంగులు వృద్ధులకు మాత్రం ఈ పింఛన్ల జారీలో చోటు లభించలేదు. దీంతో అర్హులైన అందరికి పింఛన్లు అందజేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలను ఆదుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పింఛన్ పథకాన్ని ప్రవేశ పెట్టింది. కానీ అర్హులకు అందాల్సిన పథకం అనర్హులకు అందుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేసున్నారు. లబ్ధిదారుల జాబితాలో ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్న వద్ధులకు కాకుండా డబ్బున్న బడాబాబులకు, సకల సంపదలు అనుభవిస్తున్న వారితో పాటు వికలత్వం కలిగిన ఉద్యోగులకు, కానిస్టేబుల్, డిప్యూటీ తాసిల్దార్లు, టీచర్ల కుటుంబాలకు చెందిన వారి తల్లిదండ్రులకు వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. నూతనంగా మంజూరైన జాబితాలో వారి పేర్లు ఉండటం పట్ల అర్హులైన పేదలు మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా గతంలో ప్రతినెలా 1,57,810 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందిస్తున్నారు. ఈ సారి కొత్తగా 54,571 పింఛన్లు మంజూరు చేశారు. ఇందులో 65 ఏళ్లకు పైబడిన వారు 57-65 ఏళ్ల వయస్సు ఉన్నవారున్నారు. మంజూరు చేసిన నెల రోజులకే 2,238 మంది పింఛన్లు కట్ చేశారు. ఆసరా పొందుతూ చనిపోయిన 701 మంది లబ్ధిదారులను గుర్తించారు. అయితే లబ్ధిదారుల జాబితాలో అనేక మంది అనర్హులైన వారికి పింఛన్లు మంజూరు కావడం, అర్హుల పేర్లు లబ్దిదారుల జాబితాలో లేకపోవడంతో ఆసరా పథకం చర్చనీయంశంగా మారింది. మంచాల మండలానికి చెందిన పలువురికి నాలుగైదు కార్లు, భవనాలు ఉన్న వ్యక్తికి పింఛన్ మంజూరు కావడం గమనార్హం. అదే విధంగా ఇబ్రహీంపట్నం ఉపాధి కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న ఒకరిద్దరికి వికలాంగ పెంచడం రావడం విశేషం. వారి గ్రామానికి చెందిన మరో రెవెన్యూ ఉద్యోగ కుటుంబానికి సైతం పింఛన్లు అందుతుందంటే ఆశ్చర్యార్థకం. అదే గ్రామానికి చెందిన పలువురు వితంతువులకు మాత్రం అర్హత కలిగిన పింఛన్ రావడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇలా అనర్హులకు కొంత మందికి పింఛన్ మంజూరు కావడంతో అర్హులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. పేదల సోమ్ములు పెద్దలు కొట్టుకపోతుంటే అధికారులు, ప్రజా ప్రతినిదులు ఏమి చేస్తున్నారని కాసులకు కక్కుర్తిపడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అనర్హుల ఏరివేత...
సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 57 ఏళ్లు కలిగిన వారందరికీ పింఛన్ల మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందుకు సంబంధించి గుర్తింపు కార్డులను జారీ చేసింది. అక్టోబర్ మాసంలో వారందరికీ పింఛన్ డబ్బులు అందజేసింది ఈ క్రమంలోనే అనేకమంది చనిపోయినట్టు గుర్తించింది. ఈ ప్రకారం జిల్లాలో ఆసరా పొందుతూ చనిపోయిన 701 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఇక అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబాలకు సైతం పింఛన్లు వస్తున్నట్లు గుర్తించారు. ఈ ప్రకారం మంజూరు చేసిన నెల రోజులకే 2,238 మంది పింఛన్లు రద్దు చేశారు. ఇంకా అనర్హులకు పింఛన్లు జారీ అవుతున్నాయని ప్రభుత్వాధికారులే చెబుతున్నారు. క్రమక్రమంగా వారి జాబితాలో జల్లెడ పడుతున్నట్లు చెబుతున్నారు. ఫిర్యాదు చేసే వారి పింఛన్లు తొలగిస్తామని చెప్పడం అధికారుల పనితనానికి నిదర్శనంగా చెప్పవచ్చు.
రంగారెడ్డి జిల్లాలో లబ్ధిదారులు...
జిల్లాలో ప్రతినెలా 1,57,810 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్లు అందిస్తున్నారు. ఈ సారి కొత్తగా 54,571 పింఛన్లు మంజూరు చేశారు. ఇందులో 65 ఏళ్లకు పైబడిన వారు, 57-65 ఏళ్ల వయస్సున్న వారున్నారు. మంజూరు చేసిన నెల రోజులకే 2,238 మంది పింఛన్లు రద్దు చేశారు. ఆసరా పొందుతూ చనిపోయిన 701 మంది లబ్ధిదారులను గుర్తించారు.
మంజూరైన నూతన పింఛన్లు
రాష్ట్ర ప్రభుత్వం సుధీర్ఘ కాలం తర్వాత నూతన పింఛను మంజూరు చేసింది. వారికి గుర్తింపు కార్డులను జారీ చేసింది. మొత్తం 54,571 మందుకి నూతన పింఛన్లు మంజూరు చేయగా వాటిలో అనహరాత పేరుతో 2,238 లబ్ధిదారుల కార్డులను రద్దు చేశారు. ఇక చనిపోయిన 701 మంది లబ్ధిదారులున్నారు. ఇంకా అనర్హుల జాబితాను జల్లెడ పడుతున్నారు.