Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి
నవతెలంగాణ-ఆమనగల్
మునుగోడు ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురడం ఖాయమని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాంపల్లి మండలంలోని రేవల్లి గ్రామంలో నిర్వహించిన బైక్ ర్యాలీని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, నాయకులకు ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. సుమారు 100 మందికి పైగా బైక్ ర్యాలీలో పాల్గొని ప్రచారం నిర్వహించినట్టు ఎమ్మెల్సీ కేఎన్ఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సురేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ గోపాల్ రెడ్డి, నాయకులు నరసింహ గౌడ్, వెంకన్న, నేతల వెంకన్న, కేఎన్ఆర్ యువసేన నాయకులు వెంకటేష్, విజయ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.