Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ శేర్లింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ
నవతెలంగాణ-చందానగర్
ఈ నెల 15 16 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కొత్తూరులో నిర్వరహించే సీఐటీయూ రంగారెడ్డి జిల్లా మూడో మహాసభలను జయప్రదం చేయాలని చందానగర్ పీజేఆర్ స్టేడియం ముందు గోడపత్రికలు సీఐటీయూ శేర్లింగంపల్లి కార్యదర్శి కొంగరి కృష్ణ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున నిరుద్యోగం పెరిగిందనీ, కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు చేయకుండా, వెట్టి చాకిరి చేయిస్తున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, నాలుగు లేబర్ కోడుగా మార్చి, కార్మికులను యాజమాన్యాలకు కట్టు బానిసల్లాగా మారుస్తుందని దుయ్యబట్టారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తున్న టువంటి అంగన్వాడీలు, ఆశాలకు, మధ్యాహ్నం భోజనం కార్మికులకు, జీహెచ్ఎంసీ కార్మికులకు కనీస వేతనం రూ.21 వేలు ఇవ్వాలన్నారు. కార్మికుల సమస్యల పైన రాజీ లేకుండా పోరాడుతున్న సీఐటీయూ మద్దతుగా రంగారెడ్డి జిల్లా మూడో మహాసభలను విజయవంతం చేయాలని కార్మికుల లోకానికి పిలుపునిచ్చారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్ ఎంప్లాయీమెంట్స్ జీవోలను సవరించకుండా, గెజిట్ చేయకుండా కార్మికుల జీవితాలతో చెలగాట మాడుతోందని విమర్శించారు. కొన్ని కంపెనీలు ఈఎస్ఐ,పీఎఫ్ బోనస్ సౌకర్యాలు కల్పించడం లేదన్నారు.ప్రయివేట్ ఆస్పత్రిలో, షాపింగ్ మాల్స్‌లో కనీసం కనీస వేతనం కల్పించాలని డిఆమాండ్ చేశారు. ఈ మహాసభలును జయప్రదం చేయాలని కార్మిక వర్గాన్నికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ శేర్లింగంపల్లి నాయకులు రవి,శంకర, శాంతయ్య, జ్యోతి, సువర్ణ, వరలక్ష్మి తదితరులున్నారు.