Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి మహిపాల్
- డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలన
నవతెలంగాణ-ధరూర్
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ అన్నారు.ధరూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూంలను కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ గురువారం పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూ రూం ఇండ్ల నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేసి నిరుపేదలకు అందించాలన్నారు. నిర్మాణ పనుల్లో తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. నాణ్యత లేకుండా డోర్స్, కిటికీలు తలుపులు ఉన్నాయన్నారు. ఈ పనుల్లో చేపట్టిన కాంట్రాక్టర్‌పై నాణ్యత పాటించా లన్నారు. చుట్టూ కాంపౌండ్ వాల్, వాటర్ ,డ్రయినేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియేడల కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఐక్యం చేసి, ఆందోళన చేపడుతామని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ వికారాబాద్ జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, మండల కార్యదర్శి ఏను గుల శ్రీనివాస్ రాజు, అధ్యక్షులు యాదయ్య నర్సిం లు, శ్రీనివాస్, లాలయ్య రాజు, సీహెచ్, రాజు అంజ య్య దశరథ్ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.