Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దోమ
మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో పీఆర్టీయూ దోమ మండల శాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి, మహబూబ్న గర్, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కంటే ముందుగానే ఉపాధ్యాయులకు బదిలీలు, ప్రమోషన్లు ఇప్పిస్తామని గుర్తు చేశారు. 317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులు అధైర్యపడకూడ దని, వారికి న్యాయం చేసే బాధ్యత పీఆర్టీయూ సంఘా నిదేనని తెలిపారు. సీపీఎస్ ఆంశం పీఆర్టీయూ ప్రధాన ఎజెండాగా ముందుకు తీసుకువెళ్తుందని గుర్తుచేశారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు పేస్కేల్ ఇప్పించే బాధ్యత పీఆర్టీయూ సంఘానిదే అని, మహిళా ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు. పీఆర్టీయూ రాష్ట్ర సంఘం బలపరిచిన అ భ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించా లని ఉపాధ్యాయులను కోరారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. అమర్నాథ్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.కేశ వులు, కె.ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి.గో పాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్.పురందాసు, వేణుగోపాల్, వెంకటయ్య, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ సింగ్, వీరప్ప, తదితరులు పాల్గొన్నారు.