Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి వాకటి కరుణ
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
జిల్లాలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని పట్టిష్టంగా అమ లు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి శ్రీమతి వాకటి కరుణ అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఎఫ్ఎల్ఎన్ తొలిమెట్టు కార్యక్రమం ద్వారా ప్రాథమిక పాఠశాలలలో సమూల మార్పులు తీసుకురావడానికి ఉపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారులు సమిష్టిగా కృషి చేయాలని సూచిం చారు. జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, మండల నోడల్ ఆఫీసర్లు, సెక్టోరియల్ అధికారులతో జరిగిన జూ మ్ సమావేశంలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం ద్వారా విద్యా ర్థులలో కనీస సామర్థ్యాలు సాధించాలని తెలిపారు. అందుకుగాను అక్టోబర్ 31 వరకు 15 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం చేపట్టి ఉపాధ్యాయులంద రూ సోపానాల ఆధారంగా బోధన చేస్తూ, బోధన అభ్యసన పరికరాలను ఉపయోగిస్తూ, పాఠ్యపుస్తకం ఆధారంగా చేసుకుని విద్యార్థులకు బోధించాలని తెలియజేశారు. అంతేకాక విద్యాభ్యాసానికి ఉపయోగపడే లైబ్రరీలను నిర్వ హించాలని, పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని, గణిత సామర్థ్యాలను పెంపొందించేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత ఉపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారులతో మాట్లాడుతూ జిల్లలో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాలు ఏర్పరుచుకొని పర్యవేక్షణ పటిష్టంగా జరిగే విధంగా చూడాలని విద్యాదికారులకు ఆదేశించారు. ప్రతి టీచర్ మాడ్యుల్ చదివి సిలబస్‌లోనే మంచిగా విద్యార్థులకు బోధించాలన్నారు. జిల్లాలో ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రైమరీ పాఠశాలల్లో విద్యా బోధనలో గుణాత్మక మార్పుతో ''సి'' గ్రేడ్ నుండి ''ఏ'' గ్రేడ్‌కు తీసుకోరావాలన్నారు. ఇందుకు గాను ప్రతి వారం క్లస్టర్‌లోని పాఠశాలలను సందర్శించి విద్యార్థి పురోగతిని పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి అశోక్ కుమార్, జిల్లా విద్యా శాఖ అధికారి రేణుక దేవి, ప్రధాన ఉపాధ్యాయులు, మండల నోడల్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.