Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిగి మున్సిపల్ చైర్మెన్ ముకుంద అశోక్‌కుమార్
నవతెలంగాణ-పరిగి
జీవో నెంబర్ 15ను అమలు చేయాలని పరిగి మున్సి పల్ చైర్మన్ ము కుంద అశోక్‌కుమార్ అన్నారు. గురువా రం పరిగి మున్సిపల్లోని అమరవీరుల చౌరస్తాలో పరిగి మం డల ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహ సభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజుల చిరకాల స్వప్నాన్ని గుర్తించి బీసీ డీ నుంచి బీసీ ఏ లోకి మార్చేందుకు సుప్రీం కోర్టు ఇచ్చిన సానుకూల ఆదేశాలను స్వాగతి స్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహిస్తు న్నామని అన్నారు. గత 12 సంవత్సరాలుగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ముదిరాజుల చిరకాల స్వప్నాన్ని సాధించడం కోసం ఎంతో పోరాటం చేశారని తెలిపారు. బీసీ డి నుండి బలహీన వర్గాలైన ముదిరాజులను బీసీ ఏలోకి మార్చేందుకు 2009లో అప్పటి ప్రభుత్వం జిఓ 15 జారీ చేసి నిర్ణయం తీసుకున్నప్పటికి బీసీ ఏలో ఉన్న కొన్ని కులాల వారు హైకోర్టును ఆశ్రయించి జీవోను అడ్డుకున్నా రని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుస రిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వం స్పందించి చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాలని తమ జాతికి న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.మాణిక్యం ముదిరాజ్, పరిగి వైస్ ఎంపీపీ సత్యనారాయణ ముదిరాజ్, సర్పంచ్‌లు వెంకటయ్య ముదిరాజ్, శ్రీనివాస్‌ముదిరాజ్, నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు దోమ రామచంద్రయ్య, నియోజకవర్గ ముదిరాజ్, మండల ముదిరాజ్ పెద్దలు శేరి బుచ్చయ్య ము దిరాజ్, రామస్వామి ముదిరాజ్, అనంతయ్య ముదిరాజ్, ముకుంద నాగేశ్వర్ ముదిరాజ్, పరిగి కో-ఆప్షన్ సభ్యులు ముకుంద శేఖర్‌ముదిరాజ్, హనుమంత్ముదిరాజ్, కుడు ముల యాదయ్య ముదిరాజ్, మహిపాల్ముదిరాజ్, జనార్థన్ముదిరాజ్, శ్రీనుముదిరాజ్, బందయ్యముదిరాజ్, శ్రీశైలం ముదిరాజ్, మాణిక్యంముదిరాజ్, దోమ శ్రీశైలం ముదిరాజ్, పర్షమోని బాబుముదిరాజ్, సంతోష్ ముదిరా జ్, రాజుముదిరాజ్, తేజముదిరాజ్, యాదిముదిరాజ్, చిన్నయ్యముదిరాజ్, వెంకటేష్ముదిరాజ్, శ్రీనుముది రాజ్, తదితరులు పాల్గొన్నారు.