Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మహేష్
నవతెలంగాణ-చేవెళ్ల
విద్యారంగ సమస్యల పరిష్కారా నికి పోరాడుదామని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.మహేష్ అన్నా రు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలో ప్రగతిశీల ప్రజా స్వామ్య విద్యార్థి సంఘం చేవెళ్ల డివిజన్ ముఖ్య నాయకు ల సమావేశం స్థానిక అంబేద్కర్ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి పి.మహేష్ హాజరై మాట్లాడారు.. పీడీఎస్ యూ గత అర్ధ శతాబ్దికాలంగా దేశవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, అందరికీ ఉచితమైన నాణ్య మైన విద్య కోసం ఉస్మానియా అరుణ జార్జిరెడ్డి స్ఫూర్తితో సమస్యల పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు. అదే స్ఫూ ర్తితో భవిష్యత్తులో కూడా పేద బడుగు, బలహీన వర్గాల వి ద్యార్థులకు విద్య అందేందుకు పోరాడుతుందని తెలిపారు. సమాజంలో ఉన్న కుల, మత అంతరాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యం అయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయివేటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ముగాస్తుందని అన్నారు. అందులో భాగంగానే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ స్కూలు కాలే జీలను మూసివేస్తూ ప్రయివేటు విద్యాసంస్థలకు, యూని వర్సిటీలకు అనుమతులు ఇస్తున్నారని అన్నారు. ఇది ఇ లాగే కొనసాగితే లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. విద్యారంగానికి సరిపడా నిధులు కేటాయించకపోవడంతో సమస్యలు పరి ష్కారం అవడం లేదన్నారు. కనీసం విద్యార్థులకు సకాలం లో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ ఇచ్చే స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం లేదని అన్నారు. అధికారంలోకి వస్తే శ్రీ చైతన్య నారాయణ విద్యాసంస్థలను రద్దు చేస్తామని ప్రగల్బాలు పలికిన ముఖ్యమంత్రి, గతంలో కంటే ఎక్కువ అనుమతు లు ఇవ్వడం దారుణమని అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వమే హాస్టల్ సదుపాయాన్ని కల్పించాలని, పెండింగ్లో ఉన్న 3,375 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చేవెళ్లలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించా లని లేనిపక్షంలో విద్యార్థుల పక్షాన భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా నాయకులు రాజేష్, జైపాల్, శ్రీకాంత్, అశోక్, రాజు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.