Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మర్రిగూడ ప్రచారంలో బీఎస్పీ నాయకులు ఎర్రోళ్ల జగన్
నవతెలంగాణ-షాద్ నగర్
ఆస్తుల సంపాదనే లక్ష్యంగా మును గోడు ప్రజలను ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి తాకట్టు పెట్టారని, రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలను ప్రజలు గుర్తించాలని మర్రిగూడ ప్రచారంలో బీఎస్పీ నాయకులు ఎర్రోళ్ల జగన్ అన్నారు. గురువారం మర్రిగూడ గ్రామంలోని గౌడ కులస్తులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడును 70 ఏండ్ల నుంచి అభివద్ధి కాలేదన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మునుగోడు అభివృద్ధి జరుగుతుందన్నారు. బడుగు బలహీన వర్గ సమాజం నుంచి, బీఎస్పీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆందోజు శంకరా చారికి ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు ప్రశాంత్, సీనియర్ నాయకులు పొట్ట నర్సింగ్ రావు, జడ్చర్ల నియోజకవర్గ ఇన్చార్జి బాల వర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.