Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ యుటిఎఫ్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప పిలుపు
నవతెలంగాణ-కొడంగల్
మార్చి-2022లో జరిగే మహబూబ్నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీగా ఉద్యమ నేత, విద్యారంగ సంక్షేమానికి కృషి చసే పాపన్నగారి మాణిక్ రెడ్డిని గెలిపించుకుందామని టీఎస్ యూటీఎఫ్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెప్ప పిలుపునిచ్చారు. ఈ మేరకు మండలంలో పలు పాఠశాలలో టీఎస్ యూటీఎఫ్ సభ్యత్వ నమోదు, ఉపాధ్యాయ ఓటర్ నమోదుకు సంబంధించిన అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల విద్యారంగం రాను రాను నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం ప్రయివేటీకరణకు అనుకూలంగా ఉందని ఆరోపించారు. నూతన పెన్షన్ విధానం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయుల సామాజిక భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గత 17 ఏండ్లుగా పర్యవేక్ష ణాధికారుల పోస్టుల నియామకం జరగలేదని, ఏడేండ్లుగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడం లేదన్నారు. నాలుగేళ్లుగా సాధారణ బదిలీలు కూడా జరపడం లేదన్నారు. ప్రమోషన్లు బదిలీలు చేపట్టడం వల్ల విద్యా వ్యవస్థ బాగుపడుతుందని దాంతోపాటు ఉపాధ్యాయులకు సహితం ఉత్సాహం లభించి బడులు బాగుపడే అవకాశం ఉందన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి చట్టసభల్లో టీఎస్ యూటీఎఫ్ వాణి వినిపిం చేందుకు నర్సిరెడ్డితో పాటు మరో ఎమ్మెల్సీని చట్టసభలకు పంపించే ఆలోచనలో ఉందన్నారు. గతంలో టీఎస్ యుటిఎఫ్ సపోర్టుతో గెలిచిన ఎమ్మెల్సీలు చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర్లు ఉపాధ్యాయ సంక్షేమానికి విద్యారంగ వికాసానికి ఎంతో కృషి చేసినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అలుగుబెల్లి నర్సిరెడ్డి కూడా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల్ని శాసన మండలిలో ప్రస్తావిస్తూ వాటి పరిష్కారంలో ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల పరిష్కారంలో సుదీర్ఘ అనుభవం ఉద్యమం నేపథ్యం ఉపాధ్యాయ సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకులు పాపన్న గారి మాణిక్ రెడ్డిని అధిక మెజార్టీతో మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నాన్య, ప్రధాన కార్యదర్శి భీంరెడ్డి, కోశాధికారి బసంత్, నరేష్ ,ప్రశాంత్, రఘు, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.