Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విత్తనాభివృద్ధి సంస్థ అధికారి సుస్మితా రెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
ప్రయివేట్ వ్యక్తుల ద్వారా రైతులు విత్తనాలు కొనుగోలు చేయవద్దని విత్తనాభివృద్ధి సంస్థ అధికారి సుస్మితా రెడ్డి అన్నారు. గురువారం కందుకూరు మండలం బాచుపల్లి గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ యాలాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ , విత్తనాల అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలు, ఎరువులు మాత్రమే కొనుగోలు చేయాలనీ, ప్రయివేట్ వ్యక్తుల ద్వారా కొనుగోలు చేయవద్దన్నారు. రెండోవ పంటగా రైతులు శనగ పంటను పండించుకోవాలని సూచించారు. ఎకరాకు ఆరు క్వింటాల శనగలు దిగుబడి వస్తుందని రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు రాములు, జయమ్మ,అంజయ్య, మల్లేష్, బొర్ర రాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.