Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిగి డీఎస్పీ కరుణసాగర్‌రెడ్డి
నవతెలంగాణ-దోమ
బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని పరిగి డీఎస్పీ కరుణ సాగర్‌రెడ్డి అన్నారు. గురువారం దోమ మండల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ విశ్వజన్, చైల్డ్ లైన్ సిబ్బంది రాములుతో కలిసి బాల్యవివాహల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా బాల్య వివాహాలను ప్రోత్సహించినా, పెండ్లీలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అమ్మా యిలకు 18 ఏండ్లు, అబ్బాయిలకు 21ఏండ్లు నిండి ఉండాలని తెలిపారు. బాలలు ఎవరైనా ఆపద లేదా సంక్షోభంలో ఉన్నట్లయితే 1098కి కాల్ చేయలని,మహిళా హెల్ప్ లైన్ 181 కి కూడా కాల్ చేయవచ్చనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.