Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా రెండేండ్లు కొనసాగిన మార్కెట్ కమిటీ పాలకవర్గం
- ఎమ్మెల్యే సహకారంతో పలు కార్యక్రమాలు
- తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్
నవతెలంగాణ-తాండూరు
తాండూరు నియోజకవర్గంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీకి కొత్త మార్కెట్ యార్డు ఏర్పాటు చేసేందుకు చరిత్రలో ఎవరు చేయలేని విధంగా తాండూరు పట్టణ కేంద్రంలో కొత్త మార్కెట్ యాడ్‌కు 30 ఎకరాల భూమిని సాధించిన ఘనత తమ పాలకవర్గానికి చెందుతుందని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విటల్ నాయక్ అన్నారు. రెండేండ్ల పాటు కొనసాగిన మార్కెట్ కమిటీ పాలకవర్గం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2020 సంవత్సరంలో అక్టోబర్ 20న పాలకవర్గం అధికారంలోకి వచ్చిందన్నారు. రెండేండ్ల పాటు ఎలాంటి అవినీతి అక్రమాలకు వివాదాలకు చోటు లేకుండా అందరి మన్నన్న లతో పొందినట్టు తెలిపారు. రెండేండ్లుగా తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అనేక కార్యక్రమాలు నిర్వహించి పాలకవర్గానికి సమాజంలో మంచి పేరు తీసుకు రావడం జరిగిందన్నారు. అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రవేశపెట్టి హమాలీల, దడు వాయిల, మార్కెట్ కమిటీ సిబ్బంది మనసులను గెలుచుకున్నట్టు పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే ఇట్లా ఉండాలి అన్న రీతిలో నలుగురితో కలిసి పోయి అభివృద్ధే లక్ష్యంగా కృషి చేసినట్టు తెలిపారు.తన హయాంలోనే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహకారంతో కొత్త మార్కెట్ యాడ్ కోసం 30 ఎకరాల భూమిని సాధించుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా రూ.77 లక్షలతో తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిసరాల్లో కొత్త షెడ్డు ఏర్పాటు చేసినట్టు వివరించారు. అదే విధంగా రూ.10 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కి వచ్చే రైతులకు సౌకర్యార్థం కోసం 10 లక్షలతో మరుగుదొడ్లను నిర్మించినట్టు తెలిపారు. ప్రస్తుత సమాజంలో రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నట్టు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుకు పోతామన్నారు. రెండేండ్ల పాటు, తనకు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టినందుకు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ పాలకవర్గానికి సహకరించిన కార్యాలయం సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశానుసారం నడుచుకుంటానని తెలిపారు.