Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కపాటి పాండురంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలుపొందుతారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కపాటి పాండురంగారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గం ఉపాధ్యక్షులు లక్ష్మీ నరసింహారెడ్డి, నియోజకవర్గం కార్యనిర్వహణ కార్యదర్శి అందుగుల సత్యనారాయణతో కలిసి గురువారం మునుగోడులో పసు నూరు గ్రామంలో ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథ కాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందన్నారు. బీజేపి పాలిత రాష్ట్రాలలో ఆసరా పింఛన్లు రూ. 700 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు 3016 రూపాయలు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, చేనేత, గీత, బీడీ, కార్మికులకు 2016 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు.బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా కొనసాగినా మునుగోడు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రోడ్లు అధ్వానంగా మారాయనీ, అభివృద్ధి మరితం కుంటపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్పష్టత లేదన్నారు.టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి, ప్రజలలో ఆదరణ బాగా ఉందనీ, ఆయన గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.