Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
- సీపీఐ(ఎం)రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కా.జాన్ వెస్లీ
- సీపీఐ(ఎం) మండల స్థాయి శిక్షణా తరగతులు
నవతెలంగాణ-మంచాల
మతోన్మాద బీజేపీనీ విచ్ఛిన్నం చేసేందుకు లౌకికశక్తులను ఏకం చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కా.జాన్ వెస్లీ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి భవన్లో సీపీఐ(ఎం) మండల స్థాయి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో స్థానిక సమస్యలు గుర్తించి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. దళితులకు మూడెకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తానని హామీనిచ్చిన సీఎం కేసీఆర్ గద్దె నెక్కినాక మూడెకరాల భూములు ఇవ్వక పోగా దళితుల దగ్గర ఉన్న ప్రభుత్వ భూములు (అసైన్డ్, సీలింగ్ ,పోరంబోగ్)లను లాకుంటున్నరని దుయ్యబట్టారు. అంతేకాకుండా తాతాతండ్రుల కాలం నుంచి ప్రభుత్వ భూముల్లో డిపారెస్టు భూముల్లో వ్యవసాయం చేస్తూ, జీవనం కొనసాగిస్తున్న వారికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని విమర్శించారు. వీటితో పాటు స్థానిక సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి ప్రతి కార్యకర్తా కృషి చేయాలని సూచించారు. మతోన్మాద బీజేపీనీ విచ్ఛిన్నం చేసేం దుకు లౌకిక శక్తులను ఏకం చేసి ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, మండల కార్యదర్శి నాగీళ్ల శ్యామ్ సుందర్, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస్ రెడ్డి, రావుల జంగయ్య, మండల కమిటీ సభ్యులు పుల్లగళ్ళ గోపాల్, మార బుగ్గ రాములు, నూకం రవి, లెనిన్,ఆవుల యాదయ్య, కాళ్ళ జంగయ్య, పగ డాల వెంకటేష్, సిలివేరు రాజు, రంగాపూర్ సర్పంచ్ దబ్బికార్ మమత అజరు బాస్, తోడే సువర్ణ, సయ్యద్ హాఫిజ్ పాషా,సయ్యద్ రిజ్వాన్, ఎండీ ఫాయాస్, ఆర్. స్వామి తదితరులు పాల్గొన్నారు.