Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు దుబ్బాక రామ్ చందర్
- కందుకూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-కందుకూరు
ఇండ్ల స్థలాల కోసం సర్టిఫికెట్ ఇచ్చిన వారందరికీ హద్దులు చూపించాలని కోరుతూ గురువారం సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బి. శ్రీని వాస్ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందుకున్న పేదలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ కొత్తగూడ సర్వేనెంబర్ 78 8 లో 2007 సంవత్సరంలో 185 మందికి ఒక్కొక్కరికీ 60 అప్పటి ప్రభుత్వం నిరుపేదలకు సర్టిఫికెట్లు అందజేసింది. ఈనెల బుధవారం19వ తేదీన ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల స్థలాల భూమిని పరిశీలించి , గుడిసెలు వేసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయమై పలు రాజకీయ పార్టీలు నిరు పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ఇండ్ల స్థలాలు హద్దులు చూపించే వరకు మా పోరాటం ఆగబోదని వారు హెచ్చ రించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో, సర్టిఫికెట్లు ఉన్న వారందరికీ హద్దులు చూపించాలని కోరుతూ సూపరింటెండెంట్ తాజూ దీన్కు వినతిపత్రం అందజేశారు. ఫోను ద్వారా కందుకూరు తహసీల్దార్ మహేందర్ రెడ్డి కి విషయం తెలుపగా మరో ఐదు రోజుల్లో ఈ సమస్య పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు అంకగళ్ల కుమార్, బుట్టి బాలరాజు, రావి చెట్టు చందు, ఆకుల మైలారం నరహరి, బిక్షపతి పాల్గొన్నారు.