Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రచార కమిటీ సభ్యులు ఆసిఫ్ అలీ
నవతెలంగాణ-ఆమనగల్
రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రను జయప్రదం చేయాలని ప్రచార కమిటీ సభ్యులు, రేవంత్రెడ్డి మిత్ర మండలి రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ అలీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 23 న మక్తల్ నియోజ కవర్గం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రారం భమయ్యే భారత్ జోడో యాత్ర నవంబర్ 7 వరకు ఆయా నియోజకవర్గాల్లో కొనసాగు తుందని తెలిపారు. దాదాపు 16 రోజులు రాష్ట్రంలో కొనసాగే భారత్ జోడో యాత్రలో ప్రజలు, అభిమా నులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూఐ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి యాత్రను విజయవంతం చేయాలని కోరారు.