Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు గదులను నిర్మించాలి
- ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి లిఖిత్ కుమార్
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కందుకూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-కందుకూరు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు రోడ్డు మంజూరు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కందుకూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట గంటపాటు విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి లిఖిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మించి సంవత్సరాలు గడుస్తున్నా, ఇంతవరకు రోడ్డు మంజూరు చేయలేదన్నారు. విద్యార్థులు కళాశాలకు రావాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటూ కళాశా లకు వస్తున్నారన్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధం గా ప్రతి సంవత్సరం తరగతి గదులను విద్యార్థులు సం ఖ్య పెరుగుతుందన్నారు. విద్యార్థులకు సరిపోయే అదనపు గదులు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇంగ్లీష్, మీడియం తెలుగు మీడియం విద్యార్థులకు వేరు, వేరుగా విద్య బోధిం చాలని కోరారు. ఉన్నత అధికారులు, రాజకీయా లకతీతంగా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యలను గు ర్తించి, రోడ్డు మంజూరు చేసి, నిర్మించి, ఇంగ్లీష్, మీడియం తెలుగు మీడియం, వేర్వేరుగా బోధించే ఏర్పాట్లు చేసి విద్యార్థుల సమస్యలు తీర్చాలని కోరారు. అనంతరం కందు కూరు ఆర్డీవో వెంకటాచారికి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.