Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాజేంద్రనగర్
తెలంగాణ రాష్ట్రంలో ఏఎన్ఎమ్స్ ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ యునై టెడ్ మెడికల్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు బలరాం, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎన్.రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం శివరాంపల్లిలోని డీఓంహెచ్ఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రుద్ర కుమార్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో బలరాం, రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఏఎన్ఎమ్స్ ఎదుర్కొంటున్న సమస్యలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చిన పరిష్కారం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. వ్యాక్సిన్, అలవెన్స్ యూనిఫాం అలవెన్సులు వెంటనే చెల్లించాలని అన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా, ప్రమాద బీమా సౌకర్యాన్ని వెంటనే కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సీఐటీ యూ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఏవోకి ఒక వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్య క్షులు సాయిబాబ, రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి రామ్మోహన్రావు, జిల్లా నాయకులు జి. కురుమయ్య, కృష్ణ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.