Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితాఇంద్రారెడ్డికి అఖిలపక్షం నేతల వినతి
నవతెలంగాణ-షాబాద్
నాగర్గూడను నూతన మండలం గా ఏర్పాటు చేయాలంటూ గురువారం అఖిలపక్షం నేతలు మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలను కలిసి వినతిపత్రం అందించారు. వారు నగరంలోని మం త్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను వారి నివాసాల్లో కలిసి షాబాద్ మండలాన్ని రెండుగా విభజించి, నూతనంగా ఏర్పాటు చేసే మండలానికి నాగర్గూడను కేంద్రంగా చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి భార్గవరామ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మద్దూరు మల్లేష్, జేఏసీ నాయకులు పాండు, సుధాకర్, నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.