Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాపు రూ.కోటీతో పనులు పూర్తి
- సర్పంచ్ సొంత నిధులతో గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు
- ప్రశాంత వాతావరణంలో గ్రామం
- వీధి వీధినా సీసీరోడ్లు, వీధి దీపాలు
- గ్రామాభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా : సర్పంచ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామాలు అనేక విధాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. కోట్పల్లి మండల పరిధిలోని కరీంపూర్ గ్రామం అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచింది. గ్రామంలో గల్లీగల్లిలో సీసీరోడ్లు వీధి దీపాలు ఏర్పాటు చేశారు. దాదాపు రూ.60 లక్షల నిధులతో గ్రామంలో సీసీరోడ్లు, రూ.10 లక్షల నిధులతో అండర్ డ్రయినేజీ, రైతుల సౌకర్యం కోసం పొలాలకు వెళ్లడానికి రూ.10 లక్షల నిధులతో ఫార్మేషన్ రోడ్లు పనులు పూర్తి చేశారు. గ్రామంలో దాదాపు పనులు మొత్తం పూర్తిస్థాయిలో అయ్యాయి, గ్రామంలో ఉన్న ప్రజలకు చిన్న చిన్న ఫంక్షన్ లు ఉంటే తమ గ్రామంలోనే చేసుకునేందుకు వీలుగా ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో దాదాపు రూ.13 లక్షల నిధులు మంజూరు చేశారు. మరిన్ని నిధులు తెచ్చి దాదాపు రూ.25 లక్షలతో గ్రామంలో ఓ మినీ ఫంక్షన్ హాల్ త్వరలోనే ఏర్పాటు చేస్తామని స్థానిక సర్పంచ్ అనీల్ తెలిపారు.
నవతెలంగాణ-కోట్పల్లి
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సహకారంతో రూ.3 కోట్ల యాభై లక్షల నిధులతో కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం కరీంపూర్ గ్రామాన్ని ఎంపిక చేసింది. ఈ టెండర్ పనులు పూర్తికావటంతో భవన నిర్మాణం కోసం పనులు కూడా చేయనున్నారు. బస్టాండ్ ఆవరణలో సొంత డబ్బులతో కమాన్ ఏర్పాటు చేశారు. గ్రామం నుంచి బస్టాండ్ వరకు స్తంభాలు, వీధిలైట్లు, పార్కు పల్లె ప్రకృతి వనం, శ్మశానవాటిక, డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు.
ఇదే కాకుండా గ్రామం అభివృద్ధి కోసం తమ సొంత నిధులతో గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రూ.4 లక్షలతో గ్రామంలో ఇతర పనులు చేశారు. రూ. 2లక్షలతో విద్యార్థుల సౌకర్యం కోసం ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. చిన్న గ్రామం అయినప్పటికీ గ్రామస్తుల కు, విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా గ్రామానికి నూతనంగా బస్సు సౌకర్యం కల్పించారు. గతంలో ఓ దొంగతనం జరిగితే సీసీ కెమెరాల నిఘా ద్వారా వారిని పట్టుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామం మరింత అభివృద్ధి చెందేందుకు నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామని సర్పంచ్ సుందరి అనిల్ తెలిపారు.
ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో మరింత అభివృద్ధికి కృషి
ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేస్తా. దాదాపు గ్రామంలో ఇప్పటి వరకు పనులు పూర్తి చేశాం. అక్కడ అక్కడ ఏమైనా పనులు ఉంటే వాటిని కూడా త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. మా గ్రామానికి గతంలో హాస్పిటల్ మంజూరైన ప్పటికీ బిల్డింగ్ మంజూరు కాలేదు. వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సహకారంతో గ్రామానికి త్వరలో ఆస్పత్రి నిర్మించేలా కృషి చేస్తాం.
- సుందరి అనిల్, సర్పంచ్
తడి, పొడి చెత్త వేరు చేసి గ్రామాన్ని శుభ్రంగా ఉంచుతున్నాం
గ్రామంలో ప్రతిరోజూ తడి, పొడి చెత్త వేరు చేసి గ్రామపంచా యతీ ట్రాక్టర్లో సేకరిస్తున్నాం. ప్రతిరోజూ గ్రామంలో చెత్త చెదారం లేకుండా చూస్తున్నాం. గ్రామంలో పిచ్చిమొక్కలు లేకుండా చేశాం. ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతరం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తున్నాం.
- సుభాష్, పంచాయతీ కార్యదర్శి.
మా గ్రామం చాలా ప్రశాంతంగా ఉంది
మా గ్రామానికి సుందరి అనిల్ సర్పంచ్ అయినప్పటి నుండి గ్రామం ప్రశాంతంగా ఉంది. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉన్నాయి. సమస్యలు ఉంటే గ్రామంలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం లేదు. గ్రామంలోనే పరిష్కరించు కుంటున్నాం. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు.
- సాదత్, టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు