Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ నిఖిల
నవతెలంగాణ-వికారాబాద్ కలెక్టరేట్
చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కె.నిఖిల ఉపాధ్యాయులకు తెలిపారు. గురువారం బొమ్మరాస్ పేట మండలం, చౌదర్ పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ సందర్శించారు. అనంతరం కలెక్టర్ మాట్లా డుతూ పాఠశాలలో చదువుతున్న పిల్లలను మన పిల్లలుగా భావించి మంచి విద్యను బోధిం చాలని సూచించారు. తొలిమెట్టు కార్యక్రమం కింద ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు రోజువారి తరగ తులతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి వారి సామర్థ్యాన్ని పెంచాలన్నారు. ప్రాథమిక పాఠశాలలోని కొంతమంది విద్యార్థులు రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించిన కలెక్టర్ వెంటనే ఏఎన్ఎంలను పిలిపించి వారికి ఆల్బెండజోల్ మాత్రలు ప్రతి నెలా వేయిం చాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలకు సరిగ్గా వస్తున్నారా లేదా అని వారి హాజరు వివరాలను అడిగి తెలుసుకోన్నారు. ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యా యులు బోధిస్తున్న సిలబస్ ప్రకారం విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి సామ ర్థ్యాన్ని తెలుసుకున్నారు. కొంతమంది విద్యార్థులు పాఠశాలకు పుస్తకాలతో రాక పోవడంతో, వారు ప్రతిరోజు పుస్తకాలతో సహా పాఠ శాలకు రావాలని సూచించారు. తిరిగి పాఠశాలకు వస్తానని, ఇప్పట ివరకు వారి విద్యలో పురోగతి కనిపించాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచిం చారు. పాఠశాలలో అంది స్తున్న విద్య పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలకు ప్రహరీ, కిచెన్ షెడ్ల నిర్మాణ పనులకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు గ్రామంలో పల్లె ప్రకృతి వనం, హరితహారం నర్స రీలను కలెక్టర్ సందర్శించి సంతృప్తి వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో కృష్ణన్, ఎంపీడీవో పాండు, తహసీల్దార్ వాహేదా ఖాతూన్, ఎంపీటీసీ నారాయణరెడ్డి, సర్పంచ్ వెంకటమ్మ,హెడ్ మాస్టర్ శ్రీహరిరెడ్డి, ఎంఈఓ రామ్‌రెడ్డి, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.