Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్ రావు
నవతెలంగాణ-చేవెళ్ల
విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను సాధించాలని చేవెళ్ల ఆర్డీవో వేణుమాధవ్ రావు అన్నారు. శుక్రవారం చేవెళ్ల మండల కేంద్రంలోని కెజీఆర్ గార్డెన్లో శ్రీ చైతన్య కళాశాల వెల్కమ్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని నేటి యువత కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సమయం ఎంతో విలువైనదని అనవసర విషయాల కోసం విలువైన సమయాన్ని వృథా చేయొద్దని సూచించారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారని వారు కలలుగన్నట్టుగా బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. విద్యార్థులు చెడు అలవాట్లకు బానిస కాకూడదన్ని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. అనంతరం రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ వేణుగోపాల చారి, కళాశాలలో ప్రిన్సిపాల్ శేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేందుకు లక్ష్యాన్ని ఎంచుకుని, కృషి చేయాలన్నారు. అదేవిధంగా కళాశాల పూర్వ విద్యార్థులను గుర్తు చేస్తూ తమ విద్యార్థిని, విద్యా ర్థులకు శుభాశీస్సులు తెలియజేశారు. గత పరీక్షలల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు శ్రీకాంత్, మనోహర్ రెడ్డి, శ్రీ రామ రఘు, విద్యార్థినీ, విద్యార్థులు, అధ్యాపక బృందం, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.