Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాబాద్
దీక్షా శిబిరాన్ని దగ్ధం చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చందన్వెళ్లి భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. భూ పరిహారం చెల్లించాలని గత 83 రోజులుగా చందన్వెళ్లి భూ నిర్వాసితులు, హైతాబాద్ చౌరస్తాలో శిబిరం ఏర్పాటు చేసుకుని చేస్తున్న ఆందోళన శిబిరాన్ని గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి దగ్ధం చేశారు. దీనిపై ఆగ్రహించిన భూనిర్వాసితులు హైతాబాద్ చౌరస్తాలో రోడ్డుపై కూర్చొని రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత 83 రోజులుగా హైతాబాద్ చౌరస్తాలో శాంతియుతంగా రిలే నిరహార దీక్షలు చేస్తున్నా, మా శిబిరాన్ని అక్రమార్కులు తగుల బెట్టారని వారు మండిపడ్డారు. కావాలని రెండు రోజుల ముందే ఇక్కడి సీసీ కెమెరాలు పని చేయ కుండా చేసి ఈ దుర్మార్గానికి ఒడిగట్టడం సరైంది కాదన్నారు. దీక్షా ఈ శిబిరాన్ని తగులబెట్టిన దుండ గులు వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చందన్వెళ్లి భూనిర్వాసితులు ఉన్నారు.