Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వ్యవసాయ అధికారి జ్యోతిశ్రీ
నవతెలంగాణ-మంచాల
మండల పరిధిలోని తాళ్ళపల్లిగూడ, లింగంపల్లి గ్రామాల్లో వ్యవసాయ అధికారులు భాస్వరాన్ని కరగదీసే బ్యాక్టీరియా వాడిన పంటలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాటా ్లడుతూ భూమిలో ప్రతి సీజన్లో అవసరానికి మించి భాస్వరాన్ని వాడటంతో మొక్క ఉపయోగించుకుని, భాస్వరం భూమి పొరల్లో పేరుకు పోయి నిరుపయోగంగా ఉంటుందన్నారు. ప్రయోగాత్మకంగా వ్యవసాయ శాఖ క్షేత్ర ప్రదర్శనగా కొందరి రైతుల పొలాల ఎంపిక చేసి పీఎస్పీని ఉపయోగించి, రైతులు భాస్వరం ఎరువును తగ్గించుకుని, పీఎస్బీనీ ఉపయోగించడంతో ఎరువుల ఖర్చు తగ్గి, భూమిలో పేరుకుపోయిన భాస్వరం మొక్కకు లభ్యత రూపంలోకి వచ్చి ఉపయోగపడు తోందన్నారు.వాటితో పాటు అధిక సాంద్రతతో నాటిన పత్తి పంటలను పరిశీలించి దోమ పోటు, గులాభి రంగు, కాండం తొలుచు పురుగు నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలో రైతులకు వివరించినట్టు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏఈవో శాగంటి సాయిశ్రీ, రైతులు, రాజేందర్రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులున్నారు.