Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి
నవతెలంగాణ-షాబాద్
దళితబంధు దేశానికే ఆదర్శమని జడ్పీటీసీ పట్నం అవినాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కక్కులూర్ గ్రామానికి చెందిన రమేశ్‌కు దళిత బంధు పథకం ద్వారా మంజూరైన కారును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నాని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలు, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని సంక్షేమ పథకాల పేరుతో అందిస్తూ గ్రామాల్లో మౌళిక సదుపాయాలను కల్పిస్తున్నట్టు తెలి పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మమతజీవన్ రెడ్డి, ఎంపీటీసీ కరుణాకర్, నాయకులు రాజేందర్‌రెడ్డి, రాందేవ్, రమేష్, జనార్ధన్‌రెడ్డి, యాదగిరి, కృష్ణ, నర్సింహులు, బాలు, యాదయ్య, జంగయ్య తదితరులున్నారు.