Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్కీ జ్గూడలో దాదాపు గంటసేపు అడ్డుకున్న విద్యార్థులు
- రోడ్డుకు అడ్డంగా రాళ్ళను పెట్టి ఆందోళన చేసిన గ్రామస్తులు
- సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలని విద్యార్థుల డిమాండ్
- గ్రామాలకు బస్సులను పెంచాలని యాచారం
నవతెలంగాణ-యాచారం
యాచారం మండలం పరిధిలోని మల్కీజ్ గూడలో విద్యార్థులు, తల్లిదండ్రులు శుక్రవారం ధర్నా చేపట్టారు. దాదాపు విద్యార్థులందరూ రోడ్డుకు అడ్డంగా రాళ్లను పెట్టి, గంటసేపు ఆందోళనకు దిగారు. ఇబ్రహీంపట్నం డిపో మేనేజర్ వచ్చి సమా ధానం చెప్పాలని బస్సుకు అడ్డంగా నిలుచున్నారు. పాఠశాలు, కళాశాలకు వెళ్లే విద్యార్థులు బస్సులు సమయానికి రాకుంటే, ఏలా చదువుకుంటారని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. విద్యార్థు లంతా కలిసి ఆర్టీసీ అధికారులను నిలదీశారు. గ్రామానికి సమయానికి అనుగుణంగా బస్సుల ను పెంచాలని వారు డిమాండ్ చేశారు. బస్సు డ్రైవర్, కండక్టర్ దిగి ఆందోళన విరమించాలని ప్రయత్నం చేసినా విద్యార్థులు వినలేదు. వెంటనే డిపో మేనేజర్ తమ గ్రామానికి అదనపు బస్సులు నడిపడంతో పాటు, సమయానికి అనుగుణంగా బస్సులను నడ పాలని విద్యార్థులంతా డిమాండ్ చేశారు. విద్యార్థుల ధర్నాకు సర్పంచ్ చీర యాదమ్మ, ఉపసర్పంచ్ నరేష్, గ్రామస్తులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.