Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత్స్యకార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు
- పులగాజుల జంగయ్య ముదిరాజ్
నవతెలంగాణ-కందుకూరు
మత్స్య కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని మత్స్య కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పులగాజుల జంగయ్య ముదిరాజ్ అన్నారు. శుక్రవారం కందుకూరు మండల కేంద్రంలో ముదిరాజ్ భవనం ముందు మత్స్య కార్మికుల సంఘం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆ సంఘం జెండావిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య కార్మి కుల హక్కులను సాధించుకునేందుకు ప్రభుత్వంతో పోరాడి సాధించు కోవాల న్నారు. ముదిరాజులు ఐక్యమత్యంగా ఉండి సమస్యల పరిష్కారం దిశగా అడు గులు వేయాలన్నారు. అనంతరం మాజీ మత్స్య కార్మిక సంఘం నాయకులు ఎడ్ల జంగయ్య ఇటీవల కాలంలో మృతి చెందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల జేఏసీ చైర్మెన్ ఎడ్ల వెంకటేష్ ముదిరాజ్, బేగంపేట సొసైటీ అధ్యక్షులు పులగాజుల లింగం, ప్రధాన కార్యదర్శి సన్నీల్లా వెంకటేష్, నాయకులు సుదర్శన్, సీఐటీయు మండల కన్వీనర్ బుట్టి బాలరాజు, బాలరాజు, డాక్టర్ జంగయ్య, గణేష్ ముఖం రవీంద్ర ఎడ్ల పాండు, శ్రీనివాస్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.