Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడెకరాల భూమి అమలులో సీఎం కేసీఆర్ విఫలం
- మునుగోడులో ఓటు అడిగే నైతిక హక్కు టీఆర్ఎస్కి లేదు
- జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి
నవతెలంగాణ-యాచారం
టీఆర్ఎస్ ప్రభుత్వ హామీలన్నీ నీటి మూటలుగా మిగిలాయని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి విమర్శించారు. శుక్రవారం యాచారంలో దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషా ఆచారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు, మూడెకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో గోరంత చేసి కొండంత ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో ఓటు అడికే నైతిక హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ను గద్దెదించే రోజులు దగ్గరికి వచ్చాయని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో ప్రజ లకు ఓటు ఎవరికి వేయాలో స్పష్టంగా తెలుసని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.