Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్
నవతెలంగాణ-కొడంగల్
కాంగ్రెస్‌లో ఉంటూ పార్టీకి ద్రోహం తలపెడుతున్న భువనగిరి లోక్‌సభ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని తక్షణమే పార్టీ నుండి బహిష్కరించాలని కొడంగల్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ అన్నారు. కొడంగల్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మూడేండ్ల నుండి బీజేపీకి టచ్‌లో ఉన్నానంటూ స్వయంగా ఆయన తమ్ముడు మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెబుతూ బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికు రాజీనామా చేసిన ఇప్పుడు అన్న కూడా పార్టీలో ఉంటూ కోవర్ట్‌గా మారారని అనుమానాలు కాంగ్రెస్ కార్యకర్తల్లో వ్యక్తం అవుతున్నాయి అన్నారు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతి పేరు ప్రతిపాదన చేసింది ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అయినా ప్రచారానికి రాకుండా ఎందుకు దూరంగా ఉంటున్నారన్నది బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయంలో ఇంకా ఆలస్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డినీ పార్టీ నుండి బహిష్కరించకపోతే కాంగ్రెస్కీ నష్టం జరుగుతుందన్నారు. ఈ నెల 23న భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలంలో అడుగుపెడుతున్నడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.